రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం కుక్క కాటు వలన ఆరుగురు చిన్న పిల్లలు గాయాల పాలు కాగా వారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ వీధి కుక్కల వలన చిన్నారులకు ప్రాణాపాయం ఉందని దీనిని గ్రామపంచాయతీ పట్టించుకోని నివారించాలన్నారు. చిన్నారులు పేద కుటుంబాలకు చెందిన వారని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కుక్క కాటుకు గురైన వారిలో మద్దుల వర్షిత్ 5 సంవత్సరాలు మస్కూరి బ్రితీష 6 సంవత్సరాలు తాటిపల్లి సహస్ర 5 సంవత్సరాలు ఎర్పుల వరుణ్ తేజ్ 6 సంవత్సరాలు రాగుల రుతిక 7 సంవత్సరాలు గుండం హనీష్ రెడ్డి4 సంవత్సరాలు కుటుంబాలను పరామర్శించి వారికి బ్రెడ్ ప్యాకెట్లను అందించారు. భవిష్యత్తులో ఈ చిన్నారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చికిత్స అందిస్తామని అన్నారు సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు కుక్కకాటు బారిన పడ్డ చిన్నారుల గురించి వివరాలను అందించారన్నారు. పరామర్శించిన వారిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, నాయకులు గుండాటి రామ్ రెడ్డి, చెన్ని బాబు, కొత్తపల్లి దేవయ్య, బీపేట రాజు, అంతర్పుల గోపాల్, సాంసంగ్ యాసరవేణి దేవయ్య తదితరులున్నారు