Monday, April 29, 2024
spot_img
HomeSPORTSశివానికి మూడు స్వర్ణాలు

శివానికి మూడు స్వర్ణాలు

సౌత్‌జోన్‌ జూనియర్‌ ఆక్వాటిక్‌ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ స్విమ్మర్లు నాలుగు పతకాలు కొల్లగొట్టారు. వీటిలో కర్ర శివాని ఏకంగా మూడు స్వర్ణాలతో మెరిసింది. తిరువనంతపురంలో జరుగుతున్న ఈ పోటీల్లో బాలికల 50 మీటర్ల బ్రెస్ట్‌ స్ట్రోక్‌లో ఎం.రిత్విక 0.35 సెకన్లలో రేసును ముగించి స్వర్ణం సాధించింది. బాలికల 100 మీ., బ్యాక్‌స్ట్రోక్‌ విభాగంలో కర్ర శివాని 1 నిమిషం 14 సెకన్లలో రేసును పూర్తి చేసి విజేతగా నిలిచింది. 100 మీ. బటర్‌ఫ్లయ్‌ కేటగిరీలో శివాని 1 ని. 15 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్వర్ణం ఖాతాలో వేసుకుంది. బాలికల 4్ఠ50 మీ., ఫ్రీస్టయిల్‌ రిలేలో శివాని, దిత్య, మేఘన, అనికతో కూడిన తెలంగాణ స్విమ్మర్ల బృందం 2 ని., 8 సె.,లో రేసును ముగించి పసిడి పతకం సొంతం చేసుకుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments