రాజన్న సిరిసిల్ల జిల్లా వరుసగా టెంపుల్స్ ను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ రూరల్ మండలం దుశేటుకు చెందిన యుగేందర్ (35) ఈనెల 26న బొప్పాపూర్ లో ఎల్లమ్మ పెద్దమ్మ అదేవిధంగా గోరంటాలలోని సాయిబాబా ఆలయంలో చోరీ చేసి నగదును పలు ఆభరణాలను తస్కరించిన నేపథ్యంలో ఎల్లారెడ్డిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ ఆదేశాల మేరకు సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్సై రమాకాంత్ పోలీస్ సిబ్బందితో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని మంగళవారం పట్టుకొని అరెస్టు చేశారు. నిందితునిపై 17 కేసులు ఉన్నాయని జైలుకు వెళ్లి వచ్చాక ఈ ఘటనలలో పాల్గొన్నాడని డీఎస్పీ పేర్కొన్నారు. నిందితుని వద్ద వెయ్యి రూపాయలు నగదు ఓ ఇనుప రాడ్డును స్వాధీనం చేసుకున్నారు.