క్షేత్రస్థాయిలో బలోపేతంపై టీటీడీపీ ఫోకస్ పెట్టిందని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. నేడు ఎన్టీఆర్ భవన్‌లో కాసాని అధ్యక్షతన సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో 35 వేలకు పైగా సభ్యత్వాలు నమోదు చేయాలని నిర్ణయించామన్నారు. పార్టీలో కష్టపడేవారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరటం ఖాయమన్నారు. హైదరాబాద్‌లో ఎక్కడ చూసిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధే కనబడుతోందన్నారు. ఇంటింటికీ తెలుగు దేశం పేరుతో కార్యక్రమాలు చేపట్టబోతున్నామని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు.