నేడు మంగళవారం రోజున విడుదల అయిన పదవ తరగతి ఫలితాలలో జమ్మికుంట మైనారిటీ బాలికల పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణతతో విజయకేతనం ఎగురవేశారు. అన్విత, త్రిష అనే విద్యార్థినులు 10/10 GPA సాధించారు 23 మంది విద్యార్థులు 9.0 9.9 GPA సాధించారు. ఈనెల 24వ తేదీన విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో(CEC/HEC) విద్యార్థులు 98% ఉత్తమ ఫలితాలతో విజయకేతనం ఎగురవేశారు. పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫలితాలలో ఉత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం ఉపాధ్యాయులు అభినందించారు..