లక్కవరపుకోట: నియోజకవర్గంలోని టీడీపీ-జనసేన కార్యకర్తలకు, నేతలకు కోళ్ల కుటుంబం అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. ఆదివారం మండల పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో సాయంత్రం జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో లలితకుమారితోపాటు రాంప్రసాద్ ప్రసంగించారు. నియోజకవర్గ ప్రజలకు కోళ్ల కుటుంబం నిరంతరం అండగా ఉంటూ మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటుందని తెలిపారు. వంద రోజులు ఓపికపడితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తెలిపారు. కార్యకర్తల త్యాగాలను పార్టీ మరచిపోదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల మాజీ ఎంపీపీలు, జీడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ రాష్ట్రప్రజలను ఈ దుష్టపాలన నుంచి కాపాడు అంటూ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సింహాద్రి అప్పన్నను వేడుకున్నారు. ఆదివారం సాయంత్రం మొండివీధిలో ఉన్న సింహాద్రి అప్పన్న గద్దెను దర్శించుకుని పూజలు చేశారు. నేడు జరగబోయే సింహాద్రి అప్పన్న ఉత్సవం విజయవంతం కావాలని కోరారు. కార్యక్రమంలో జీఎస్ నాయుడు, కొణదం మల్లేశ్వరరావు, కాపుగంటి వాసు, చెక్క కిరణ్, చెల్లయ్య, మోపాడ చిన్నికృష్ణ తదితరులు వున్నారు.