రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపెళ్లి గ్రామానికి చెందిన అంజయ్య(43) అనే వ్యక్తి బెహ్రెయిన్ లో గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అంజయ్య ఆరు నెలల క్రితం ఉద్యోగ నిమిత్తం బెహ్రెయిన్ దేశం వెళ్లాడు. రోజు మాదిరిగానే బుధవారం విధులకు వెళ్లేందుకు రెడీ అవుతుండగా గుండెపోటుతో కుప్పకూలాడని అత్యనితో పాటు గదిలో ఉండే మిత్రులు ఆ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఈ ఆకస్మిక సంఘటనతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అల్ముకున్నాయి మృతుడికి భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు