ముస్లిం సోదర సోదరీమణులు పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఖబ్రస్తాన్ లో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా గత కొన్ని సంవత్సరాలుగా ఏర్పాట్లు చేస్తున్న మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు. రానున్న 11వ తేదీన రంజాన్ పండుగను పురస్కరించుకొని ఖబ్రస్తాన్ లో పెరుకుపోయిన మొక్కలను, చెత్త తొలగింపు పనులను దగ్గరుండి మున్సిపల్ సిబ్బందితో చేయించిన మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉండి అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు.