ముస్తాబాద్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు వేడుకలు ఎంపీపీ జనగామ శరత్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయము మండల కేంద్రంలోని శివకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సభాముఖంగా కెసిఆర్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ మండల ఎంపీపీ జనగామ శరత్ రావు సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి పట్టణ అధ్యక్షుడు నర్సింహారెడ్డి సర్వర్ పాషా టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు పార్టీ సభ్యులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు
