మరో అనువాద తమిళ డబ్బింగ్ చిత్రం కంజూరింగ్ కన్నప్పన్ త్వరలో ప్రేక్షకులను అలరించడానికి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నది. డిసెంబర్ 8న తమిళ నాట విడుదలైన ఈ హర్రర్ కామెడీ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకున్నది. సెల్విన్ రాజ్ జేవియర్ తొలిసారి దర్శకత్వం వహించగా, AGS ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఈ చిత్రంలో సతీష్, రెజీనా కసాండ్రా, నాసర్, ఆనందరాజ్, శరణ్య పొన్వన్నన్ , VTV గణేష్ , రెడిన్ కింగ్ సే ప్రధాన పాత్రల్లో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిచారు.
కథ విషయానికి వస్తే.. కన్నప్పన్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం తిరుగుతూ ఓ పాడుబడ్డ ప్యాలెస్‌లోకి వెళ్లి ఓ యంత్రం వల్ల కలల్లోకి వెళ్లి ఇరుక్కుపోతాడు. అయితే అక్కడ తను కనే కలలు బయట నిజంగా జరుగుతూ వారిని అ కలలోకి వచ్చేస్తారు. ఈ సందర్భంగా అక్కడికి ఒక్కొక్కరే వచ్చి బందీ కావడం, నిద్ర పోకుండా ఉండాల్సి వస్తుంది.
ఈక్రమంలో వారందరి చర్యలతో మంచి వినోదంతో పాటు అక్కబడక్కడ భయపెట్టే సన్నివేశాలతో ఆద్యంతం ఇంటిల్లి పాదికి ఫుల్ మీల్స్ భోజనంలా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు ఇంకా బాగా నచ్చే అవకాశం ఉంది. థియేటర్లలో మంచి కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా జనవరి 5నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తమిళంలో పాటు తెలుగు, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవనుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా చేశారు. ఇంకెందుకు ఆలస్యం కంజూరింగ్ కన్నప్పన్ సినిమా ఓటీటీలోకి రాగానే చూసి ఎంజాయ్ చేయండి.