కమ్యూనికేషన్ పరికరాల తయారీ సంస్థ మిమోసా నెట్‌వర్క్స్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ సేవల అనుబంధ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ కొనుగోలు చేయనుంది…
ఒప్పందం విలువ రూ.490 కోట్లు
కమ్యూనికేషన్ పరికరాల తయారీ సంస్థ మిమోసా నెట్‌వర్క్స్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ సేవల అనుబంధ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం విలువ 6 కోట్ల డాలర్లు. మన కరెన్సీలో రూ.490 కోట్ల పైమాటే. జియో ప్లాట్‌ఫామ్స్ తన అనుబంధ విభాగమైన రాడిసిస్ కార్పొరేషన్ ద్వారా ఈ కొనుగోలు చేపట్టింది. జియోకు 5జీ టెలికాం, బ్రాడ్‌బ్యాండ్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది. మిమోసా నెట్‌వర్క్స్ వైఫై-5తో పాటు వైఫై6ఈ టెక్నాలజీల ఆధారిత పాయింట్ టు మల్టీ పాయింట్ ప్రొడక్ట్స్, తదితర యాక్సెసరీలను తయారు చేస్తోంది.