రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో ముస్లిం మైనార్టీ పెద్దల ఆధ్వర్యంలో ముస్లింలు పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం మసీదులు ఈద్గా ల వద్దకు వెళ్లి ప్రత్యక్ష ప్రార్థనలు చేశారు మసీదులలో, ముత్తవల్లిల ప్రత్యక్ష ప్రార్ధనల అనంతరం దార్మీకోపన్యాసం చేసారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగన్ని సమర్పిచుకుంటూ బక్రీద్ ప్రతి ఏటా భక్తి శ్రద్దులతో జరుకుంటాం అని ఎల్లారెడ్డిపేట ఇమం సాబ్ తెలిపారు. త్యాగ నిరతికి బక్రీద్ పండుగను నిదర్శనమని అన్నారు. పేద, ధనిక అన్న తారతమ్యం లేకుండా రాగద్వేశాలకు అతీతంగా మైనారిర్టీలందరు ఒకరినొకరు అలాయి బాలయి తీసుకున్నారు. ఈద్ ముబారక్ శుభాకాంక్షలు జరుపుకుంటూ బంధుమిత్రులతో సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు బక్రీద్ పండుగ సందర్భంగా మేక, గొర్రె పోతులను ప్రత్యక్షంగా కోయించి నిరుపేద కుటుంబాలకు, దానం చేశారు. విందులు ఇచ్చారు. నిరుపేదలైన ముస్లిం కుటుంబాలకు నూతన వస్త్రాలను దానం చేశారు. ఆర్థిక సహాయం చేశారు. బక్రీద్ విశిష్టతలో భాగమైన ఖుర్బానీ ని చుట్టుపక్కల వారికి దానంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈద్గా ల వద్ద చేరుకొని బక్రీద్ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అలాయి భళాయి తీసుకున్నారు హైమద్ డాక్టర్, చాంద్ పాషా, బాబా, మండల మైనారిటీ ప్రెసిడెంట్ హుసేన్, తదితరులు పాల్గొన్నారు