రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మహిళ అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంబేద్కర్ నగర్ కు చెందిన ఎనగందుల బుధవ్వ (45) అనే మహిళ ఉదయం 11 గంటలకు ఇంట్లో నామాపూర్ కు వెళ్తున్నానని వెళ్ళింది. సాయంత్రం నామాపూర్ లో ఉన్న కుటుంబ సభ్యులు ఇంటికి రాలేదని సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యుల, బంధువుల ఇండ్లలో చుట్టుపక్క ప్రాంతాలలో గాలించారు. మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.