కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని స్థానిక మడిపల్లి చౌరస్తా ఆటో స్టాండ్ వద్ద మాచర్ల వినయ్.తన సోదరుడు కీశే.మాచర్ల భీష్మ మూడవ వర్ధంతి సందర్భంగా సోదరుని జ్ఞాపకార్థం శనివారం రోజున చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కీర్తిశేషులు మాచర్ల భీష్మ కుమారులు మాచర్ల రిషికేష్, మాచర్ల మోక్షజ్ఞ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల వినయ్ తో పాటు ఎలగందుల శ్రీహరి, పిట్టల రమేష్, లాడే రామారావు, అల్లే రాజమొగిలి, చుక్క తిరుపతి, పెరుమాండ్ల సాంబయ్య, హోటల్ రాజు తదితరులు పాల్గొన్నారు
