రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణు గోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం నిర్వహించిన సుదర్శన హోమంలో ఆలయ అధ్యక్షులు గడ్డం జితేందర్ దంపతులు, ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్ దంపతులు, అశ్విని హాస్పిటల్ జనరల్ సర్జన్ డాక్టర్ రవి కిరణ్, ఫిజిసియన్ డాక్టర్ అమితా దంపతులు పాల్గొన్నారు. ఆలయ ఆర్చకులు నవీన్ చారి సుదర్శన్ హోమం వలన కలిగే ప్రయోజనాలు భక్తులకు బోధించారు. శ్రీ విష్ణువు లేదా శ్రీ నరసింహ స్వామికి తన ఆయుధం సుదర్శన చక్రం ద్వారా అంకితం చేయబడిన అగ్నికర్మ కార్యక్రమం సుదర్శన్ హవన్ మీకు చెడు లేదా ప్రతికూల శక్తుల నుండి దూరంగా ఉండటానికి, చెడు కళ్ళ నుండి మిమ్మల్ని రక్షించడానికి ప్రతికూల శత్రువులు, చెడు గ్రహ స్థానాలు మరెన్నిటి నుండో వ్యతిరేకంగా నిలబడటానికి ధైర్యాన్ని అందించడంలో మీకు సహాయపడుతుందన్నారు. పూజ మిమ్మల్ని పోరాటాలు, అడ్డంకులు, శత్రువుల నుంచి కాపాడుతుందన్నారు. సుదర్శన భగవానుని ఆశీస్సులు పొందేందుకు ప్రజలు ఈ పూజ చేస్తారు. సుదర్శన పూజయజ్ఞం భక్తుని విజయం మరియు విజయ మార్గంలో రాబోయే ప్రమాదాలను ముందుగా చూడడంలో సహాయపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నేవూరి మమతా వెంకట్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి, గోదా గోష్టి మహిళా భక్తులు తదితరులు పాల్గొని సుదర్శన హోమంను భక్తిశ్రద్ధలతో తిలకించి స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తకోటికి ఆలయ అర్చకులు నవీన్ చారి తీర్థప్రసాదాలు దద్దోజనం ఫలహారాలు పంపిణి చేశారు



