దొంగ వాహనాలను గుర్తించడానికి , ప్రమాదాల నివారణకు,నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఉపయోగించి చైన్ స్నాచింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని అరికట్టడానికి ప్రతి రోజు వాహనాల తనిఖీ చేపడుతున్నని, ఈ వాహనాల తనిఖీలకు వాహనదారులు సహకరించాలని ముస్తాబద్ ఎస్.ఐ శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఉపయోగించి చైన్ స్నాచింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న దృష్ట్యా,రోడ్డు ప్రమాదాల నివారణకు, వాహనాల దొంగతనాలు అరికట్టడంలో భాగంగా వాహనాల తనిఖీ చేపడుతూ నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి రెక్టిఫై చేయడం జరుగుతుందని,రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా వాహనదారులు సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని,సరైన నెంబర్ plate ఉండే విధంగా చూసుకోవాలని అవగాహన కల్పిస్తున్నామని,ఈ యొక్క తనిఖీలు వాహనదారులు అందరు పోలీస్ వారికీ సహకరించలని ఎస్.ఐ శేఖర్ కోరారు..