Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAమారేడ్‌పల్లి బస్తీ పర్యటనలో MLA శ్రీగణేష్

మారేడ్‌పల్లి బస్తీ పర్యటనలో MLA శ్రీగణేష్

కంటోన్మెంట్ నియోజకవర్గం సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన బస్తీ పర్యటనలో భాగంగా మంగళవారం ఎమ్మెల్యే శ్రీగణేష్ మారేడ్‌పల్లిలో పర్యటించారు. ముఖ్యంగా ఈస్ట్ మారేడ్‌పల్లి మెయిన్ రోడ్ లోని సుమన్ కాలనీ వాసులు తాము ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న డ్రేనేజీ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎమ్మెల్యే జిహెచ్ఎంసి వాటర్‌వర్క్స్ డిజిఎం విద్యాసాగర్ మరియు కంటోన్మెంట్ హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ లతో కలిసి కాలనీలోని సమస్యను పరిశీలించారు. అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే వెంటనే తగు చర్యలు తీసుకొని ఈ సమస్యను పరిష్కరిస్తానని హామి ఇచ్చారు. ఈ బస్తీ పర్యటన కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్, జిహెచ్ఎంసి వాటర్‌వర్క్స్ డిజిఎం విద్యాసాగర్, కంటోన్మెంట్ హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ తో పాటు కాలనీ నాయకులు, కాలనీ వాసులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments