Tuesday, January 21, 2025
spot_img
HomeTELANGANAఅక్రమ వడ్డీ , ఫైనాన్స్ వ్యాపారస్తులపై పోలీసుల కొరడా.

అక్రమ వడ్డీ , ఫైనాన్స్ వ్యాపారస్తులపై పోలీసుల కొరడా.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై శనివారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు 24 టీమ్లు గా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమ వడ్డీ వ్యాపారాం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న 14 మంది పై కేసులు నమోదు చేసి 16,13,000/- నగదు, 359 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని అనుమతులు లేకుండా ఫైనాన్స్ నిర్వహించిన, అధిక వడ్డీలతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు.

నేడు ఎస్పీ ఆఫీస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని వడ్డీలకు డబ్బులు ఇచ్చి వారి నుండి అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు తమకున్న అత్యవసర పరిస్థితి, తాత్కాలిక అవసరాల కోసం అధిక మొత్తంలో అవసరంకు మించి అధిక వడ్డీలకు అప్పు చేసి ఆతరువాత అప్పులు, అధిక వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలకుపాల్పడి తమ కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయవద్దుని ఎస్పీ కోరారు. ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన పద్దతులలో ఫైనాన్స్ నిర్వహించే వారిని మాత్రమే నమ్మాలి అని ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకపోయిన అక్రమ ఫైనాన్సు వ్యాపారం నడిపేవారి వివరాలు జిల్లా పోలీస్ కార్యాలయంలో తనకు సమాచారం ఇవ్వొచ్చు అని, స్థానిక పోలీసు వారికి, డయల్100 కు ఫిర్యాదు చేయాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు సమగ్ర విచారణ చేసి బాధితులకు న్యాయం చేయడం లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని ఆయన తెలిపారు. అప్పు తీసుకోవడం, ఇవ్వడం నేరం కాదు కానీ ఆర్ బి ఐ నియమ నిబందనలు, తెలంగాణా మని లెండింగ్ చట్టంలోని నిబందనల ప్రకారం చట్టబద్దంగా ఎవరైనా లైసెన్స్ తొ అప్పులు ఇవ్వవచ్చు, తీసుకోవచ్చు కాని చట్టవిరుద్ధంగా, అధిక వడ్డీ రేట్లతో సామాన్యుల పై దౌర్జన్యం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments