శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం పెనుగొండ రోడ్ లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ త్వరలో రానున్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ 65వ జన్మదినాన్ని పురస్కరించుకొని వివిధ రకాల పదివేల మొక్కలు పంపిణీ చేశారు. ఈ విశిష్టమైన కార్యాన్ని ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు, భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ సంస్థ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫరూక్ ఖాన్ అధ్యక్షతన నిర్వహించారు. భూమి మీద సమస్త జీవరాసులకు అలాగే అన్ని మతాల ప్రజలకు ఆహారం ఆక్సిజన్ నీరు ఆరోగ్యం నీడ తదితరాలనందించి కాపాడే తల్లివంటి ప్రకృతిని ప్రతిఒక్కరూ కాపాడుకోవాలని, పెంచుకొని, రుణంతీర్చుకోవాలని ఈ సందర్భంగా వక్తలు తెలియజేశారు. ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ ప్రవక్త మొహమ్మద్ సొల్లాల్లాహు అలైహి వసొల్లం తన సందేశంలో ప్రళయం ముంచుకొస్తున్నా సరే కొద్దిగా సమయముంటే ఓ మొక్కను నాటండి అన్నారని యుద్ధ సమయాల్లో చెట్లపై దాడిని నిషేదించారని అన్నారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని అన్ని సామాజిక సేవా సంస్థలు పార్టీల రాజకీయనాయకులు, పరిశ్రమల అధినేతలు, వివిధ శాఖల అధికారులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ అశ్వర్త నారాయణ నారాయణ స్వామీజీ, పర్యావరణవేత్త డాక్టర్ శంకర్ నారాయణ, మండల విద్యా అధికారి గంగప్ప, మౌలానా ఉస్మాన్ ఘనీ, మౌలానా ఇస్మాయిల్, క్రైస్తవ సంఘం నాయకుడు నాగేందర్, సిక్కు సంఘం నాయకుడు పల్వీందర్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షులు జమీల్, తెలుగుదేశం అధ్యక్షులు డీఈ. రమేష్, జనసేన నాయకులు నిమ్మకాయల రాములు, ఇన్నర్ వీల్ క్లబ్ సంస్థ అధ్యక్షురాలు విద్య, డాక్టర్ శ్రీవాణి, భువనేశ్వరి, మాస్టర్ ఫైరోజ్, చరణ్, ఉసామా ఖాన్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలను పంపిణీ చేశారు
మొక్కల పంపిణీ లో మత సామరస్యాన్ని చాటిన హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు సంఘాలు
RELATED ARTICLES