Tuesday, October 8, 2024
spot_img
HomeANDHRA PRADESH2024-25 బడ్జెట్ లో మైనారిటీ కాంపోనెంట్ యాక్ట్ (సబ్ ప్లాన్) అమలు చేయాలి: ఉమర్ ఫారూక్...

2024-25 బడ్జెట్ లో మైనారిటీ కాంపోనెంట్ యాక్ట్ (సబ్ ప్లాన్) అమలు చేయాలి: ఉమర్ ఫారూక్ ఖాన్

బడ్జెట్ లో మైనారిటీ కాంపోనెంట్ యాక్ట్ (సబ్ ప్లాన్) అమలు చేయాలని కోరారు అఖిల భారత షహీద్ టిప్పుసుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ రాష్ట్ర ప్రభుత్వానికి తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ముస్లింలకు బడ్జెట్ లో సబ్ ప్లాన్ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన కోరారు. గత వైసిపి పాలనలో ఏప్రిల్ 2022న మైనార్టీ కాంపోనెంట్ యాక్ట్ పై చట్టం చేసిన (6/2022) జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉప ప్రణాళిక అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపలేదని మైనారిటీ కాంపోనెంట్ యాక్ట్ నిర్వీర్యం కాకుండ ప్రస్తుత టిడిపి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఎన్నికల వాగ్దానాలు మరియు హామీల్లో సబ్ ప్లాన్ హామీని ఇచ్చారని ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చే సమయం ఆసన్నమైందన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సారీ ముస్లింలకు కేటాయించటమే తక్కువ దానిలోను కనీసం 30శాతo అయినా ఖర్చు పెట్టలేదని అందుకే సబ్ ప్లాన్ పద్దతిలో బడ్జెట్ కేటాయింపులు జరిగితే ముస్లిం మైనారిటీ లకే బడ్జెట్ ఖర్చుపెట్టే ఆచరణరూపం దాల్చవచ్చని కానిపక్షంలో కేటాయింపులు ముస్లిం మైనారిటీలకుఅందక ఇతర ఖర్చుల రూపంలో ముస్లిం మైనార్టీ ల బడ్జెట్ దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని ముస్లిం మైనార్టీ లకు ప్రభుత్వ యంత్రాంగం రిక్త హస్తాలు చూపే ప్రమాదం ఉందని అన్నారు

‘ సబ్ ప్లాన్ ‘ సాధన కోసం గతంలో ముస్లిం సంఘాలు ఉద్యమించారని 2018-2019 బడ్జెట్ లో అల్ప సంఖ్యాకులకు 1102 కోట్లు కేటాయించినట్టు తెలుస్తుంది. గత సంవత్సరాల్లో కేటాయింపులు (840) కంటే 31 శాతం ఎక్కువని మన మిత్రులు సంతోషపడ్డారని వాస్తవంగా రాష్ట్ర బడ్జెట్ కూడా 20 శాతం ఎక్కువగా తయారైయింది. కనుక అల్ప సంఖ్యాకులకు సుమారు 10 శాతం మాత్రమే పెరిగినట్టుగా భావించారు. గత సంవత్సరాలలో కూడా కేటాయింపులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే వచ్చాయి రాష్ట్ర బడ్జెట్ లాగే. అయితే చిక్కల్లా ఏమిటంటే ఏ ఏడాది కూడా ఆ ఏడాదికి కేటాయించిన బడ్జెట్ మొత్తం ఆ సంవత్సరంలో సంబంధితుల కోసం వ్యయం చేయటం జరగలేదు. 2017-2018 సంవత్సరాలలో కేటాయింపులు వాటిని వివిధ పద్దుల క్రింద ఖర్చు చేసిన వివరాలను ముస్లిం ప్రజా సంఘాలు సమాచార హక్కు చట్టం క్రింద రాష్ట్ర ప్రభుత్వం నుండి రాబట్టిన అధికారిక పత్రం చూస్తే కేటాయించిన బడ్జెట్ మొత్తం కేవలం 50 శాతం మార్చి చేసినట్టుగా వెల్లడవుతుంది.

మిగులు 50 మొత్తం ప్రభుత్వ ఖజానాకు తిరిగి జమ చేయబడింది. ఇది అనాదిగా జరుగుతున్న అన్యాయం. ఆ కారణంగా కేటాయించిన మొత్తాన్ని పూర్తిగా అల్పసంఖ్యాకుల కోసం ఖర్చు చేసేలా చూడాలి. ఈ విధంగా ఖర్చు చేయించాలంటే అల్ప సంఖ్యాకుల కోసం ‘ సబ్ ప్లాన్ ‘ ను సాధించుకోవాలి. అప్పుడు మాత్రమే కేటాయింపులన్నీ సంబంధితుల కొరకు పూర్తిగా వ్యయం చేయటం తప్పనిసరి అవుతుంది. ఏ కారణంగానైనా పూర్తిగా వ్యయం కాకపోతే రానున్న సంవత్సరాలకు మిగులు మొత్తం ‘ క్యారీ ఫార్వర్డ్ ‘ అవుతాయి. నూతన సంవత్సరంలో కేటాయించే బడ్జెట్ లో గత సంవత్సరపు మిగులు ప్రత్యేకంగా కలుస్తుంది తప్ప మిగిలిన మొత్తాలు ఎప్పటిలాగా ప్రభుత్వ కోశానికి తిరిగి జమ చేయబడవు. అందువల్ల ‘ సబ్ ప్లాన్ ‘ ను సాధించుకునేoదుకు ముందుకు సాగటం అన్ని విధాల ఉపయిక్తమని నా భావన.

దీని కోసం రాష్ట్రం లోని ముస్లిం ప్రజా సంఘాలు రాష్ట్రప్రభుత్వం వరకు ఈ సందేశాన్ని యుక్తి తో చేర్చి సాధించే ప్రయత్నం చేయాల్సి ఉంది. ముస్లిం మైనారిటీ జన సముదాయం సమగ్రాభివృద్ధికి సబ్ ప్లాన్ ఏర్పాటు ఒక్కటే పరిష్కారమని సబ్ ప్లాన్ సాధనకు ముస్లిం సమాజం సంఘటితం అవ్వాలని వివిధ ముస్లిం సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముస్లింలకై సబ్ ప్లాన్ అమలు పరిచేందుకు చిత్త శుద్ధితో కృషి చెయ్యాలని ఆయా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేయాలని అధికార తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో ముస్లింలకు సబ్ ప్లాన్ను తమ ఎన్నికల అజెండాగా ప్రకటించిందని ముస్లింలకు కేటాయించిన అరకొర బడ్జెట్ను కూడా ప్రభుత్వాలు పూర్తిగా వినియోగించటంలేదని మిగిలిన బడ్జెట్ ను దారి మళ్లిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న ముస్లిం సమాజం పురోగతి సాధించాలంటే ఆ సమాజానికి సబ్ ప్లాన్ కేటాయించటమే ఏకైక పరిష్కార మార్గం అని ఉమర్ ఫారూక్ ఖాన్ స్పష్టం చేసారు.

సబ్ ప్లాన్ హామీని అమలు చేయాల్సిందిగా ముస్లిం సమాజం నుంచి వస్తున్న సబ్ ప్లాన్ డిమాండ్ ప్రభుత్వం అమలు చేయాలని ముస్లింల సమగ్రాభివృధికి ఉపయోగపడే సబ్ ప్లాన్ రానున్న బడ్జెట్లో తక్షణం అమలు పరచనట్లైతే ఆర్ధిక బుడ్జెట్టుకి ముందే రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సబ్ ప్లాన్ విషయమై స్పష్టమైన ప్రకటన చెయ్యాలని సబ్ ప్లాన్ కార్యచరణను ప్రకటించి సబ్ ప్లాన్ అవసరాన్ని ఉపయోగాన్ని ముస్లిం సమాజం ముందుకు తీసుకెళ్లే విధంగా దశలవారీ కార్యచరణను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ముస్లిం గడప వరకు కరపత్రాలను చేరవెయ్యాలని అఖిల భారత షహీద్ టిప్పుసుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ నిర్ణయించిందని ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించి ముస్లిం సమాజాన్ని జాగృతం చేస్తామని వివిధ పార్టీలోని ముస్లిం నేతలను సంఘటిత పరిచి ఉద్యమాన్ని ఉధృతం చెయ్యాలని కోరుతున్నామన్నారు. ప్రస్తుత బడ్జెట్ లో సబ్ ప్లాన్ సాధించాలని ముస్లిం నగారా & అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ డిమాండ్ చేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments