జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో గొట్టే హర్షవర్ధన్, మీడియాతో మాట్లాడారు. రావుల శ్రీధర్, రావుల కవిత అను వారు పోలీస్ క్వార్టర్స్ ఎదురుగా జమ్మికుంట కొత్తపల్లిలో గల సర్వే నెం 467/14, భూమిని దాదాపు 43 సం,,రాల క్రితం ప్రభుత్వం వారు హుజురాబాద్ తాసిల్దార్ కార్యాలయం నుండి భూమి లేని నిరుపేద స్కీమ్ క్రింద నా యొక్క తండ్రి గోవర్ధన్ మరియు బాబాయిలు గొట్టె శంకరయ్య, గొట్టె అనంతం మొదలగు మా కుటుంబ సభ్యుల 10 మందికి గృహ నిర్మాణం కొరకు ఒక్కొక్కరికి 0-02 గుంటల చొప్పున మంజూరు చేసి పట్టాలు జారీ చేసిన రోజు నుండి గృహ నిర్మాణం చేసుకొని అప్పటి గ్రామ పంచాయితి రశీదులు పొంది 40 సం॥రాల నుండి ఇప్పటి వరకు జారీ చేసిన కుటుంబ సభ్యులతో జీవిస్తున్నాము. మాకు ఇచ్చిన భూమిని కొందర వ్యక్తులు ఎలాంటి హక్కులు లేకుండా కబ్జా చేయడానికి ప్రయత్నించినారు. మా కుటుంబ సభ్యుల వ్యక్తుల ఆరోగ్య, ఆర్ధిక పరిస్థితులు మంచిగా లేనందున ఇందులోనుండి సుమారు 0-02 గుంటల భూమిని సర్దన ఎల్లమ్మ,కు సాదాబైనామా ద్వారా గత 30 సం॥రాల క్రితం మా నాయనమ్మకు సంబందించిన గృహ నిర్మాణంతో విక్రయించినాము. సర్దన ఎల్లమ్మ యోగక్షేమములు చూసుకుంటున్న తన కుమారుడైన సర్దన రవీందర్ కు గిఫ్ట్ చేయడమైనది.
రావుల శ్రీధర్, రావుల కవిత, రావుల శివ, ఆమె యొక్క కుటుంబ సభ్యులు అ భూమి పై కన్ను వేసి, భూమి లోకి రాగా వారిపైన సర్దన రవీందర్, హుజురాబాద్ జూనియర్ సివిల్ కోర్టులో స్టే ఆర్డర్ పొందియున్నారు. రావుల శ్రీధర్, రావుల కవిత, కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణలు అవాస్తము. ఎందుకనగా రావుల కవిత, ఆమె భర్త రావుల శ్రీధర్ హుజురాబాద్ కోర్టులో లాయర్ను నియమించుకొని ఎలాంటి సరియైన ఆర్డర్ లేకుండా సర్దన రవీందర్ పై కబ్జా చేసిండు అనడం అవాస్తం. సర్దన రవీందర్ పరువు తీసే విధంగా నిందలు వేస్తున్నారు. నేను ఎవరి భూమిని కబ్జా చేయలేదు గతములో అనగా 2019 సం॥లో రావుల శ్రీధర్, రావుల కవిత, రావుల శివ మా భూమిపై కన్ను వేసి మా యొక్క రేకుల షేడ్డును అర్ధరాత్రి అక్రమంగా చొరబడి మీది పై కప్పును కూలగొట్టినారు. ఈ విషయముపై జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఎస్.సి, ఎస్.టి కేసు కూడా నమోదు అయిన క్రమములో నష్టపరిహరం రూ॥ 10,000/- ఇస్తు, ఇక నుండి మీ భూమిలోకి నేను రాను అని రావుల సుశీల, రావుల కవిత, రావుల శ్రీధర్ కుటుంబ సభ్యులు వ్రాత పూర్వకంగా వ్రాసి ఇచ్చినారు అని అన్నారు. తిరిగి ఇబ్బందులకు గురి చేయడం సరికాదని అన్నారు..


