‘తెలంగాణ వలస కథలు వస్తు శిల్ప వైవిధ్యం’ అనే అంశం మీద పరిశోధన పూర్తి చేసినందుకుగాను ఉస్మానియా యూనివర్సిటీ శుక్రవారం డాక్టరేట్ ప్రకటించింది. పెద్దింటి అశోక్ కుమార్ రాసిన లాంగ్ మార్చ్, జిగిరి రెండు నవలలు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పీజీ మరియు డిగ్రీ విద్యార్థులకు సిలబస్ గా ఉన్నాయి. పెద్దింటి సాహిత్యం మీద వివిధ యూనివర్సిటీలలో నాలుగు పీహెచ్డీ, ఆరు ఎంఫిల్ పరిశోధనలు జరగగా, మరో మూడు పీహెచ్డీ పరిశోధనలు జరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో జన్మించిన పెద్దింటి అశోక్ కుమార్ సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్ నగర్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పెద్దింటి 300కు పైగా కథలు, ఎనిమిది నవలలు, ఐదు నాటకాలతో పాటు సినిమాలకి కథలు మాటలు పాటలు రాస్తున్నారు. పెద్దింటి రాసిన జిగిరి నవల 12 భాషల్లోకి అనువాదం అయింది. ఆయన సాహిత్యం పై అనేక పీహెచ్డీలు ఎంఫిల్ పరిశోధనలు జరిగాక ఆయన డాక్టరేట్ పూర్తి చేయడం ఒక విశేషం.