Warning: Uninitialized string offset 0 in /home/therainbowservic/inquilabtv.com/wp-includes/class-wp-dependencies.php on line 1

Warning: Uninitialized string offset 0 in /home/therainbowservic/inquilabtv.com/wp-includes/class-wp-dependencies.php on line 1
నన్ను వ్యతిరేకిస్తున్నది.. కుర్చీపై కన్నేసిన వారే! - inquilabtv.com
Saturday, December 7, 2024
spot_img
HomeTELANGANAనన్ను వ్యతిరేకిస్తున్నది.. కుర్చీపై కన్నేసిన వారే!

నన్ను వ్యతిరేకిస్తున్నది.. కుర్చీపై కన్నేసిన వారే!

కాంగ్రెస్‌లో నలుగురైదుగురు సీనియర్‌ నేతలు తప్ప.. పార్టీలోని మిగతా వారంతా తన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. పీసీసీ కుర్చీలో కూర్చోవాలనుకుంటున్న వారు మాత్రమే తనను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. పార్టీలో అన్ని నిర్ణయాలు అందరినీ అడిగే తీసుకుంటామని, ఫలితం తేడాగా వస్తే మాత్రం అధ్యక్షుడే విఫలమయ్యారనడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ కుమ్మక్కై.. తమ అక్రమాలపై ఒకదానిపై మరొకటి దాడి చేసుకుంటూ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఒక్కటే ప్రజా సమస్యలపై పోరాడుతున్నందున వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ఫలితాలు పార్టీ పనితీరుకు గీటురాయి కాదని ఎన్నోసార్లు రుజువైందన్నారు. కాంగ్రెస్‌ ట్రస్టుకు సంబంధించి కోట్లాది రూపాయలను మర్రి శశిధర్‌రెడ్డి స్వాహా చేశారని, వాటి లెక్కలు అడిగినందుకే బీజేపీలో చేరారని ఆరోపించారు. డిసెంబరు మొదటి వారంలోగా పార్టీని ప్రక్షాళన చేసి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్తవారిని నియమించనున్నట్లు తెలిపారు. 

శశిధర్‌రెడ్డి సీనియారిటీ అంతా అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించడానికే ఉపయోగపడింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రోజైనా ఆయన రోడ్డెక్కారా? సోనియాగాంధీని, రాహుల్‌గాంధీని ఈడీ పిలిస్తే.. వేలాది మంది పార్టీ కార్యకరలు ధర్నాలు చేసినప్పుడు, అక్రమ కేసులు పెట్టి బీజేపీ వేధించిన్పడు ఆయన ఎక్కడ ఉన్నారు? కనీసం ధర్నాలో ఎందుకు పాల్గొనలేదు? ఎన్‌డీఎంఏ వైస్‌ చైర్మన్‌గా, కేంద్ర మంత్రి హోదాతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే గా 2014లో సనత్‌నగర్‌ నుంచి పోటీ చేస్తే ఆయన మూడో స్థానానికి పరిమితమయ్యారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో అతి తక్కువ ఓట్లుసాధించారు. 2018లో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ కూడా ఇవ్వలేదు. 2020లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగితే సనత్‌నగర్‌లో ఏడు డివిజన్లకూ ఆయన చెప్పిన వారికే టిక్కెట్లు ఇచ్చారు. అందరూ ఓడిపోయారు. నేను మల్కాజిగిరిలో పోటీ చేసినప్పుడు తన నియోజకవర్గం పరిధిలో కూడా ప్రచారానికి రాలేదు. ఆయన గత ఎనిమిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండి పార్టీకి ఏమి చేసినట్లు? కేసీఆర్‌ అవినీతిపై పోరాడారా? స్వయంగా ఆయన కొడుకు ఆదిత్యరెడ్డి సైతం తన తండ్రి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని 2018లో కోదండరాం పార్టీలో చేరారు. నేను అధ్యక్షుడైన తర్వాత కాంగ్రె్‌సలోకి తీసుకొచ్చాను. కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేసిన నేతను చేర్చుకున్నందుకు బీజేపీకి సిగ్గుండాలి. కాంగ్రె్‌సకు కాన్సర్‌ వచ్చిందంటున్న శశిధర్‌రెడ్డికే ఎయిడ్స్‌ వచ్చింది.

చాలాసార్లు ఆయన ఇంటికి వెళ్లాను. తనకు 73 ఏళ్ల వయసు ఉన్నందువల్ల జీవిత చరమాంకంలో పీసీసీ అధ్యక్షుడిని కావాలనుకుంటున్నానని, ఢిల్లీకి వెళ్లి ఆ పదవి తనకు ఇప్పించమని శశిధర్‌రెడ్డి అడిగారు. అయితే పార్టీ మీకు ఇస్తే మీతో కలిసి పనిచేసేందుకు అభ్యంతరం లేదని, నేను చెబితే పదవి ఇచ్చే పరిస్థితులు ఢిల్లీలో లేవని చెప్పాను. కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా కలిసి పనిచేద్దామని అడిగితే ఎలాంటి స్పందనా కనిపించలేదు. ఢిల్లీ నేతలు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంలేదనేవారు. దానికి నేనేం చేయాలి?

కాంగ్రెస్‌ పార్టీకి.. కోటీలో నగర కాంగ్రెస్‌ పేరిట మంచి ఆస్తులున్నాయి. పీజేఆర్‌ బతికున్నప్పుడు ఆ ట్రస్టు బాధ్యతలు ఆయనే చూసేవారు. మెట్రో రైలు విస్తరణ వల్ల దానికి కోట్లాది రూపాయల ఆదాయం వచ్చింది. ఇంకా పార్టీకి అక్కడ దుకాణాలున్నాయి. శశిధర్‌రెడ్డి ఈ ట్రస్టులో కీలక బాధ్యతలో ఉన్నారు. రాష్ట్రాల వారీగా ఉన్న ఆస్తులపై పీసీసీ నుంచి ఒక కమిటీపి వేసి.. ఆ ఆస్తులను ఎవరైనా ఆక్రమించారా? అన్యాక్రాంతమైందా? అన్నది తేల్చాలని, అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ఒక వ్యక్తి కాకుండా పీసీసీయే వాటిని నిర్వహించాలని ఢిల్లీ నుంచి పార్టీ కోశాధికారి మధూసూదన్‌ మిస్త్రీ పదే పదే లేఖలు రాశారు. దీనిపై నేను శశిధర్‌రెడ్డిని అయిదారు సార్లు పిలిచి అడిగాను. దీనితో ఆయన భయభ్రాంతుడై లెక్కలు చెప్పాల్సి వస్తుందని.. పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయారు. కోట్ల రూపాయల ఫ్రాడ్‌ జరిగింది. పీజేఆర్‌ చనిపోయిన తర్వాత కోటీలో ఆస్తులను శశిధర్‌రెడ్డే నిర్వహించారు. మెట్రో లైన్‌ నుంచి వచ్చిన నష్టపరిహారం ఎంత?ఇంత వరకు వచ్చిన అద్దె మొత్తం ఎంత? ఆ డబ్బులు ఎక్కుడున్నాయో, ఇప్పుడున్న దుకాణాలు ఎవరికి కేటాయించారో చెప్పాలని శశిధర్‌రెడ్డికి చాలెంజ్‌ చేస్తున్నా. తమ చుట్టాలకు నామమాత్ర రేట్లకు ఇచ్చి వాళ్లనుంచి పెద్ద పెద్ద వాళ్లకు ఎక్కువ అద్దెలకు ఇచ్చి పెద్ద మొత్తాలను స్వాహా చేస్తున్నారని సమాచారం. ఇంకా చాలామంది ఉన్నారు. అత్యంత విలువైన ఆస్తులు ఇంకా చాలా ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ గాంధీభవన్‌లో అద్దెకున్నది. బోయిన్‌పల్లిలో వైఎస్‌ హయాంలో పార్టీకి కేటాయించిన భూమిలో పనులు చేద్దామన్నా, 35జిల్లాల్లో ఆఫీసులు ప్రారంభించాలన్నా డబ్బుల్లేవు. అనేక జిల్లాల్లో పార్టీకి కోట్లాది విలువైన ఆస్తులున్నాయి. ఎక్కడికక్కడ వ్యక్తులు కబ్జా చేసుకున్నారు. ట్రస్టు ఆస్తులను స్వాహా చేసినందుకు శశిధర్‌రెడ్డిని లోపలెయ్యాలి. వివరాలు చెప్పమంటే సహకరించకుండా నాపై ఆరోపణలు చేస్తారా? కోటీలోని ఆస్తులపై పారదర్శకరమైన విచారణకు ఆయన సిద్ధంగా ఉన్నారా? ట్రస్టు సొమ్ము తిన్నోడు బాగుపడతాడా?

 కొత్త నాయకత్వాన్ని చేర్చుకుంటే తప్ప.. మన ఓటింగ్‌ శాతం పెరగదని రాహుల్‌గాంధీ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు పలుసార్లు చెప్పారు. టికెట్‌ పార్టీ నిర్ణయిస్తుందని, సీఎల్పీ, పీసీసీ నిర్ణయించవని, చేరికలకు అభ్యంతర పెట్టకూడదని రాహుల్‌ అన్నారు. మీరు పనిచేయరు.. ఓట్లు రావు.. ఇతరులు చేరొద్దు.. వారు వస్తే నేను పోతా అంటే ఎలా? నేను అధ్యక్షుడినయ్యాక 30 మందికిపైగా పార్టీలో చేరారు. పోయింది ముగ్గురే. నా టికెట్‌ కూడా అధిష్ఠానమే నిర్ణయిస్తుంది. పార్టీ వ్యవస్థలో ఇన్నేళ్ల అనుభవం ఉన్నవారు అనే మాటేనా అది? ఇన్నేళ్ల అనుభవం ఉన్న శశిధర్‌ రెడ్డికి ఎందుకు టికెట్‌ ఇవ్వలేదు? పార్టీలో ఎవరైనా ఎందుకు చేరతారు? సర్వే చేసి మీకు అవకాశముంటే తప్పక ఇస్తామని పై వాళ్లు చెబితేనే కదా వారు చేరేది? ఉదాహరణకు హుస్నాబాద్‌లో ప్రవీణ్‌రెడ్డి అనే బలమైన నేత చేరారు. ఆయన ఢిల్లీ నేతలతో మాట్లాడుకుని వారు పరిశీలిస్తామని చెప్పిన తర్వాతే చేరారు. ఎంపీటీసీ స్థాయి ఉన్న మరో నేత ఆయనకెట్లా టికెట్‌ ఇస్తారంటూ బయటకు పోతే నేనేం సమాధానం చెప్పాలి?

తెలంగాణలో 30 మంది సీనియర్‌ నాయకులున్నారు. అందులో నలుగురైదుగురు తప్ప.. మిగతా సీనియర్‌ నేతలు, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులంతా నన్ను ఒప్పుకొంటున్నారు. ఈ నలుగురైదుగురి అభిప్రాయాలు ఎప్పుడూ మారవు. నన్ను దించి కుర్చీలో కూర్చోవాలనుకున్న తర్వాత వారెలా మారతారు?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments