యువతలో చైతన్య తీసుకొచ్చేందుకే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేయనున్నట్లు తెలుగుదేశం పార్టీ విజయనగరం అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నేత నారా లోకేష్ యవగళం పేరుతో చేపట్టనున్న పాదయాత్రకు సంబంధించిన లోగో ను అమరావతి టీడీపి కేంద్ర కార్యాలయంలో టీడీపి సీనియర్ నాయకులు రాష్ట అధ్యక్షులు అచ్చెన్నాయుడు, షరీప్,చిన్నారాజప్ప, అనిత, ఆనంద్ బాబు, కాల్వ శ్రీనివాసులు,నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, కిమిడి నాగార్జున ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ 400 రోజులపాటు నాలుగు వేల కిలోమీటర్లు లోకేష్ పాదయాత్ర సాగుతుందన్నారు. వంద నియోజకవర్గాల్లో పాదయాత్ర కవర్ చేయడం జరుగుతుందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో యువత, రైతులు, మహిళలు తీవ్ర అన్యాయానికి గురయ్యారన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు అని తెలిపారు.
యవగళం పాదయాత్ర లోగో ఆవిష్కరణ
RELATED ARTICLES