కార్వాన్ నియోజకవర్గం గుడిమల్కాపూర్ డివిజన్ జాంసింగ్ దేవాలయం ప్రాణంగంలో బోనాల ఉత్సవాల సందర్భంగా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై 162 చెక్కులు నియోజకవర్గంలో ఉన్న దేవాలయాల కమిటీ సభ్యులకు కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ తో కలిసి అందజేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో నేను భాగస్వాములు అవడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి అవకాశం నాకు కల్పించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, దేవదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖకి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బోనాల ఉత్సవాల పండుగను కార్వాన్ నియోజకవర్గ ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కోరారు. బోనాల ఉత్సవాల పండుగ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అన్ని శాఖల అధికారులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచించారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్, కార్వాన్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే జానబీ ఉస్మాన్ బీన్ మహమ్మద్ అలీ హజ్రి, కాంగ్రెస్ నాయకులు, రెవిన్యూ అధికారులు, దేవదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్, కార్వాన్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే జానబీ ఉస్మాన్ బీన్ మహమ్మద్ అలీ హజ్రి, కాంగ్రెస్ నాయకులు, రెవిన్యూ అధికారులు, దేవదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు..