రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన చేపూరి మహేందర్ అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో చాతిలో నొప్పి రావడంతో గ్రామంలోని ఆర్ఎంపి వైద్యుడిని సంప్రదిస్తే పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించడంతో ఆ రాత్రి ఆసుపత్రికి వెళ్లే క్రమంలోనే మార్గమధ్యలో మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. మహేందర్ ది నిరుపేద కుటుంబం కావడంతో ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. రెక్కడితే గానీ డొక్కాడని స్థితిలో ఉన్న ఆ నిరుపేద కుటుంబం ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో దుఃఖ సాగరంలో మునిగిపోయారు.