మహబూబాబాద్ లోని కంకరబోడు 21వ వార్డులో ముస్లింల జనాభా అత్యధికంగా ఉంటుంది. ఈ వార్డులో ఒక ప్రభుత్వపాఠశాల, రెండు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, రెండు అంగన్వాడీ కేంద్రాలు, ఒక డిగ్రీ కాలేజ్ ఉన్నాయి. నిత్యం ఈ ప్రాంతంలో పసిపిల్లలు, విద్యార్థులు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. దాదాపు రెండు నెలల నుండి మహబూబాబాద్ మునిసిపాలిటీ పారిశుధ్య సిబ్బంది ఈ ప్రాంతంలో కాలువలు తీయకపోవడం, పిచ్చి మొక్కలు తొలగించకపోవడం, చెత్తాచెదారాన్ని అలాగే వదిలి వేయడం వల్ల ఈ ప్రాంతంలో పాములు, పందులు, దోమలు, కుక్కలు విపరీతంగా సంచరిస్తున్నాయి. మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి ఎన్నిసార్లు విన్నపించుకున్నా పట్టించుకోవడం లేదని సత్వరమే చర్యలు తీసుకుని పరిసరాల పరిశుభ్రతను చేపట్టాలని మహబూబాబాద్ మున్సిపాలిటీ సూపర్వైజర్ శ్రీధర్ కు వినతిపత్రం ఇచ్చిన మహబూబాబాద్ ముస్లిం సంఘాల JAC పట్టణ అధ్యక్షులు జహీరుద్దీన్. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ ముస్లింలపై వివక్ష చూపే విధంగా మహబూబాబాద్ పట్టణమంతా శుభ్రపరుస్తూ, కేవలం ముస్లింలు అత్యధికంగా ఉండే ప్రాంతమైన కంకర బోడ్ ను శుభ్రం చేయకపోవడం వల్ల పాములతో, దోమలతో, పందులతో, కుక్కలతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని దయచేసి త్వరగా పారిశుద్ధ్య కార్మికులను మా ప్రాంతానికి పంపించి శుభ్రపరచాలని లేకపోతె ఈ వర్షాకాలంలో ప్రజలు వ్యాధులబారిన పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.