రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మలోత్ తేజ్యా నాయక్ (46 ) గుండెపోటుతో ప్రస్తుతం నివాసమై ఉంటున్న ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున మరణించారు. తేజ్యా నాయక్ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నివాసమై ఉంటూ చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అతనికి భార్య భారతి, కుమారుడు గంగాధర్, కూతురు సరిత లున్నారు. అతని కుమారుడు గంగాధర్ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములోని
నంద్యాలలో ఉన్నత విద్యా భ్యాసంచేస్తుండగా, కూతురు డిల్లీ నగరంలో ఉందని వారు వచ్చే వరకు తేజ్యా మృతదేహాన్ని ప్రీజర్ లో భద్రపరుస్తారు. వారు వచ్చిన తరువాత ఆదివారం అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఏర్పాటు చేశారు,