రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో సిరిసిల్ల SDPO ఉదయ్ కుమార్ వివిధ కులాలకు చెందిన సంఘ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. వ్యక్తి హక్కు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎవరినైనా కుల బహిష్కరణ చేసినట్లయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. పంచాయతీ పేరుతో డబ్బులు వసూలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసి హెల్మెట్ ధరించడం, తాగి వాహనాలు నడపకూడదని సూచించారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇచ్చినట్లయితే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం చికోడు గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయం వద్ద ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీసీ కెమెరాలు యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ దేవాలయాలు, షాపింగ్ మాల్స్ మరియు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

