సోమవారం రోజున ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలో జమ్మికుంట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ K . కిషోర్ గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు. గ్రామాలలో యువత గంజాయి వాడకం మరియు చెడు వ్యసనాలకు అలవాటు కాకూడదని దానివలన కలిగే దుష్ప్రభావం గురించి మరియు సైబర్ నేరాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇలాంటి నేరాలు గ్రామాలలో ఎవరైనా చేసినట్టు దృష్టికి వస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట సబ్ ఇన్స్పెక్టర్ N.రాజ్ కుమార్, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…


