‘బాహుబలి’ ప్రాంచైజీతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రభాస్. ప్రస్తుతం వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తూ ఫుల్ బిజిగా ఉన్నాడు. ‘ఆదిపురుష్’ షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేశాడు. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాల చిత్రీకరణ ఇప్పటికే 50శాతానికి పైగా పూర్తయింది. ఈ చిత్రాలు పట్టాల మీద ఉండగానే.. కొత్తగా మరో ప్రాజెక్టును ఒకే చేశాడు. మారుతి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మూవీలో ముగ్గురు హీరోయిన్స్‌కు చోటుందని సమాచారం. ఇప్పటికే ఇద్దరి హీరోయిన్స్ పేర్లు బయటకు రాగా.. తాజాగా మూడో హీరోయిన్ కూడా ఎంపికయిందని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి.
‘రాజా డీలక్స్’ లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మూడో హీరోయిన్ కోసం చిత్ర బృందం కొంత కాలంగా అన్వేషణ కొనసాగిస్తుంది. ఆ అన్వేషణకు తెరపడినట్టే కనిపిస్తుంది. మూడో హీరోయిన్‌గా రిద్ది కుమార్ ఛాన్స్ కొట్టేసిందని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. రిద్ది గతంలో ‘రాధే శ్యామ్’ లో చిన్న పాత్రను పోషించింది. రాజ్ తరుణ్ ‘లవర్’ లోను హీరోయిన్‌గా నటించింది. మూడో హీరోయిన్‌గా శ్రీ లీల నటించనుందని గతంలో రూమర్స్ హల్‌చల్ చేశాయి. రిద్ది ఎంపికతో ఈ రూమర్స్‌కు బ్రేక్ పడినట్టు అయింది. ‘రాజా డీలక్స్’ హార్రర్ కామెడీగా తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. హార్రర్ కామెడీగా రూపొందిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్‌కు తాతగా బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ నటించనున్నాడట. ప్రభాస్ డ్యూయల్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.