ఎల్లారెడ్డి పేట ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల1982-83 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థి రాధాకృష్ణ ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9.10వ తరగతికి చెందిన 110 మంది విద్యార్థులకు బోర శ్రీనివాస రాసిన స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలను ఉచితంగా శనివారం అందజేశారు. ఈ సంవత్సరం 10 జిపిఎ సాధించబోయే విద్యార్థులకు శ్రీరాజరాజేశ్వర ఆవాస విద్యాలయం కరస్పాండెంట్ రాధాకృష్ణ ప్రత్యేక బహుమతులు ప్రకటించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టీ.మనోహరచార్యులు ఉపాధ్యాయులు, 1982-83 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు అభినందించారు..