కాకినాడ జిల్లా జగ్గంపేట వైఎస్ఆర్సీపీ టౌన్ ప్రెసిడెంటుగా కాపవరపు వరప్రసాద్ ని జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ తోట నరసింహం నియమించారు. ఆయనని జగ్గంపేట జడ్పీటీసీ ఒమ్మి బిందుమాధవి రఘురామ్, గండేపల్లి ఎంపీపీ చలగళ్ల దొరబాబులతో పాటు పలువురు అభినందించారు. ఈ సందర్భంగా కాపవరవు ప్రసాద్ మాట్లాడుతూ మాజీ మంత్రి, ఓటమి లేని యోధుడు, నియోజకవర్గ ఇంచార్జి తోట నరసింహం విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. వైఎస్ఆర్సిపి జగ్గంపేటలో హ్యాట్రిక్ కొట్టడానికి ప్రతి ఒక్కరిని కలుపుకుని పని చేస్తానన్నారు.
టౌన్ ప్రెసిడెంట్ గా కాపవరపు ప్రసాద్ ని నియమించిన మాజీ మంత్రి తోట నరసింహం
RELATED ARTICLES