ముంబై: టిగోర్ ఎలక్ట్రిక్ కారును మరిన్ని అదనపు ఫీచర్లతో టాటా మోటార్స్ అందుబాటులోకి తెచ్చింది. మరిన్ని టెక్నాలజీ, లగ్జరీ ఫీచర్లతో కూడిన అప్‌డేటెడ్ టిగోర్ ఈవీ.. నాలుగు వేరియంట్లలో (ఎక్స్‌ఈ, ఎక్స్‌టీ, ఎక్స్‌జెడ్ ప్లస్, ఎక్స్‌జెడ్ ప్లస్ లక్స్) లభించనుంది. దీని ప్రారంభ ధర రూ.12.49 లక్షలు కాగా.. గరిష్ఠ రేటును కంపెనీ రూ.13.75 లక్షలుగా నిర్ణయించింది.