రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపెల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి విద్యుత్ అంతరాయం ఏర్పడి గ్రామ ప్రజలు అంధకారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో శనివారం రోజు కూడా పూర్తిగా విద్యుత్ రాలేదని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ సమస్యలు ఏర్పడుతున్నాయని సమస్య తొందరగా పరిష్కరించి నాణ్యమైన విద్యుత్ అందజేయాలని గ్రామస్తులు మీడియా ముందు వాపోయారు. అక్కపెల్లితో పాటు బుగ్గ రాజేశ్వర తండా ప్రజలు కూడా విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు