రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నాడు మండలంలో జరిగిన ఉపాధి హామీ పనులపై రాజన్న సిరిసిల్ల జిల్లా డి ఆర్.డి.ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో ఆయన వివిధ గ్రామాల కార్యదర్శులను, ఫీల్డ్ అసిస్టెంట్ లను ప్రశ్నిస్తూ ఆయా గ్రామాలలో ఉపాధి హామీ పనుల ప్రగతి ఆడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డి ఆర్ డి ఓ శేషాద్రి మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీల లక్ష్యాలను అధిగమించాలని ఆయన పంచాయితీ సెక్రటరీలను ఫీల్డ్ అసిస్టెంట్లను కోరారు. ఈ కార్యక్రమంలో ఏపిడి నరసింహులు, ఎంపీడీవో శ్రీనివాసమూర్తి, ఏ పి ఓ చంద్రయ్య, ఈసీ హర్షద్, టెక్నికల్ అసిస్టెంట్ లు కంప్యూటర్ ఆపరేటర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ సిబ్బంది, పాల్గొన్నారు.