రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంఎల్సీ అభ్యర్థి అల్పోర్స్ నరేందర్ రెడ్డి సోమవారం నామినేషన్ వేసిన సందర్బంగా ఎల్లారెడ్డి పేట కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలివెళ్ళారు. కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కళాశాల నుండి ఇందిరా గాంధీ చౌరస్తా మీదుగా కలెక్టరేట్ వరకు జరిగిన ర్యాలీ లో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు దోమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాద్యక్షులు షేక్ గౌస్ బాయి, ఎఎం.సి వైస్ ప్రసిడెంట్ గుండాడి రామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
