‘‘జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ వేస్ట్, అవన్నీ తీసేసి పాత పద్ధతినే కొనసాగించాలి’’ అంటూ కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విద్యా దీవెన, వసతి దీవెన పథకాల డబ్బులు జమ చేయలేదంటూ ఆదోని సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థిని మాట్లాడిన మాటలు చర్చనీయాంశమయ్యాయి. ‘ఆదోనిలో కళాశాలల విద్యార్థులంతా సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారంటే కారణం ఒక్కరే.. మిస్టర్ జగన్మోహన్‌రెడ్డి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయడం లేదు. దీంతో విద్యార్థులు నష్టపోతున్నారు’ అని ఆ విద్యార్థిని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కరెక్ట్‌గా పథకాలు అమలు చేయకపోతే విద్యార్థుల సత్తా ఏంటో చూపిస్తామంటూ ప్రభుత్వాన్నిఆమె హెచ్చరించారు.
జగన్మోహన్‌రెడ్డి పథకాలన్నీ వేస్ట్!
RELATED ARTICLES