రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గంజాయి అమ్ముతున్న ఒకరిని పోలీసులు పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కన్నెపల్లి గ్రామానికి చెందిన పబ్బతి రాహుల్ గత కొన్ని రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తూ జల్సా లకు అలవాటు పడి అందిన కాడికి సొమ్ము చేసుకుంటున్నట్లు స్పష్టమైన సమాచారం మేరకు ఎల్లారెడ్డిపేట దుమల వైపు పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానుస్పద్ధంగా వ్వక్తి ని పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. గంజాయిని ఎవరైనా విక్రయిస్తే కఠినంగా చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ హెచ్చరించారు.


