రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మధ్యాహ్న భోజనాన్ని ఎంపీడీవో సత్తయ్య, డిప్యూటీ తాసిల్దార్ సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా నాయకులు షేక్ గౌస్, చెన్ని బాబు, గుండాడి రామ్ రెడ్డి, నంది కిషన్, మెండే శ్రీను తదితరులు కలిసి పరిశీలించారు. వంటకాలు ఎలా చేస్తున్నారని వంట చేసే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు
