పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ మార్కండేయ ఆలయానికి సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి సహాయంగా రూ.35000 విలువ చేసే 100 కుర్చీలను విరాళంగా ఇవ్వడం పట్ల పద్మశాలి సేవా సంఘం వారు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీ మార్కండేయ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఆలయంలో గుండారపు కృష్ణారెడ్డి లహరి దంపతులకు శాలువా కప్పి సన్మానించారు. మెమొంటోను అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ మాట్లాడుతూ ఆలయానికి విరాళంగా 100 కుర్చీలు బహూకరించడం హర్షించదగ్గదని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం సభ్యులు రాపెల్లి దేవంతం, వనం రమేష్, దుంపేటి గౌరీ శంకర్, ప్రముఖ జిరాక్స్ సెంటర్ రాపెల్లి అంబదాస్, శ్రీరామ్ సుదర్శన్, సుంకి భాస్కర్, దోమల భాస్కర్, చింతకింది శ్రీకాంత్, సిద్ది రాములు, గోశిక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



