టెట్ పరీక్ష ఫీజును వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు కొర్రి అనిల్ డిమాండ్ చేశారు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో కొర్రి అనిల్ మాట్లాడుతూ గత ప్రభుత్వం టేట్ 2 పరీక్షలకు గాను 400 రూపాయలు వసూలు చేయగా నేడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక పేపర్ కు 1000 రూపాయలు వసూలు చేస్తుందని 1000 రూపాయలు ఫీజు ఉండడంతో టెట్ పరీక్ష రాసే విద్యార్థులు వెనుకడుగు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పేపర్ కె 1000 రూపాయలు వసూలు చేస్తూ నిరుద్యోగ యువతను నట్టేట ముంచుతూ నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తుందని అన్నారు. గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో టెట్ రెండు పరీక్షలకు గాను 400 రూపాయలే పరీక్ష ఫీజు ఉండగా నేడు రెండు పరీక్షలకు గాను 2000 రూపాయలు వసూలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి టెట్ పరీక్ష ఫీజును తగ్గించాలని డిమాండ్ చేశారు,