హైదరాబాద్: నూతన సంవత్సరం వేడుకల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అర్ధరాత్రి కేబీఆర్ పార్క్ వద్ద ఆయన కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కమిషనర్ నగరంలో పలు చోట్ల కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్‌పెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సరం వేడుకలు నగరంలో ప్రశాంతంగా జరిగాయన్నారు. కొత్త సంవత్సరంలో అనేక సవాళ్లు ఉన్నాయని, ల్యాండ్ గ్రాభింగ్స్, డ్రగ్స్, శాంతి భద్రతల పరిరక్షణ కోసం మరింత మెరుగ్గా ముందుకు వెళతామన్నారు. డ్రగ్స్ టెస్ట్ కోసం నూతన పరికరాలు కూడా ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. చివరిగా ఆయన మరోసారి నగర ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.