సోమవారం ZPHS ఓబులాపూర్ పాఠశాలలో ముందస్తు ఉగాది సంబరాలను ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు అంగరంగా వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బండి ఉపేందర్ మాట్లాడుతూ ఉగాది పచ్చడి షడ్రుచుల వలె ప్రతి వ్యక్తి విద్యార్థుల జీవితాలలో సమస్యలు వస్తూ పోతుంటాయని చేదు జ్ఞాపకాలను దూరం చేసుకుంటూ తీపి గుర్తులను మన మనోఫలకలపై ముద్రించుకోవలని అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందంనకు, విద్యార్థిని, విద్యార్థులకు ముందస్తు క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం గుండెల్లి రవీందర్, పలుమారు తిరుపతి, గాజంగీ కీర్తి, మంచికట్ల గంగ భవాని, పట్టెం పద్మ, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం మ్యాన సంధ్య, భీమనాతిని శ్రీలత, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.