తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ ను శుక్రవారం మద్యాహ్నం గంభీరావుపేటలోని తన స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాలు కప్పి సన్మానించారు. తన స్వగ్రామమైన గంభీరావుపేటకి మొట్టమొదటి సారిగా వచ్చిన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గూడ విజయ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతూరి భూపాల్ రెడ్డి, బండారి బాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి టీమ్ సభ్యులు కిరణ్, శ్రావణ్ లు మార్యాదపూర్వకంగా కలుసుకొని రంజాన్ సందర్భంగా ఈద్ మూబారక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆజ్మతుల్లా హుస్సేన్ వారితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజాపాలన చూసి ప్రజల మద్దతుతో పార్లమెంట్ ఎన్నికల్లో 14 పార్లమెంటు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారని బిఆర్ ఎస్ పార్టీ ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలుపొందదని ఆయన స్పష్టం చేశారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికల్లో సమిష్టిగా కృషిచేసి కాంగ్రెస్ పార్టీ ని గెలిపించినట్టు రేవంత్ రెడ్డి నీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించాలని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు,