తంగళ్ళపల్లిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు. స్వంత పార్టీ నేతలు, ప్రతిపక్ష నేతల పోన్లను ట్యాంపరింగ్ చేసిన వ్యక్తి కేటీఆర్ అంటూ పైర్ అయ్యారు జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మునిగేల రాజు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ ఎమ్మెల్యే సభ్యత్వం కోల్పోయి జైలుకు పోవడం ఖాయం అని బెదిరింపు రాజకీయాలు మావీ కాదు మీవి..అందుకే ఒక్కొక్కరిగా జైళ్ళ పాలు అవుతున్నారు అన్నారు. జిల్లేళ్ళ గ్రామంలో 20 గుంటల భూమికి పరిహారం రాకుండా ఆపింది ఎవరో ఆత్మపరిశీలన చేసుకోవాలని కాల్వలు పూర్తీ అయితే అందరికీ మంచిది నీళ్ళు రాకపోవడానికి కారణం మీరే కారణం అన్నారు. కెటిఆర్ చేయని తప్పు లేదు దోపిడి లక్ష్యంగా పాలన సాగిస్తూ కోట్లు దోచుకున్నాడని, బెదిరింపు రాజకీయాలు చేసిన వ్యక్తులు ఎవరో ప్రజలందరికీ తెలుసని అప్పుడు మీరు చేసిన బెదిరింపు రాజకీయల వల్లనే ఇప్పుడు జైల్ పాలు అవుతున్నారని రాబోయే కాలంలో అవినీతి నేతల భరతం పడతాం, పేదలకు అండగా ఉంటామన్నారు.
రైతులకు నష్టపోయిన పరిహారం ఇవ్వాలని మీరు మాట్లాడడం సిగ్గుచేటని మీ ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన బస్వాపుర్ రైతులను ఆదుకోలేదు ఎందుకని ప్రశ్నించారు. బస్వాపూర్ రైతులను పరామర్శించడానికి వచ్చిన ప్రతిపక్ష నేతలపై భౌతిక దాడులకు దిగినా చరిత్ర మీదని బస్వాపుర్ రైతులకు ఎంత నష్టపరిహారం ఇచ్చారో చెప్పి రైతుల గురించి మాట్లాడాలన్నారు. జిల్లేళ్ళ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరిగి యేండ్లు గడుస్తున్నా పంపిణీ చేసిన పాపాన పోలేదని కేకే మహేందర్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు మీకు లేదని మరోసారి కాంగ్రెస్ పార్టీ నాయకులపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదన్నారు మునిగేల రాజు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చుక్క రాజశేఖర్, సోషల్ మీడియా జిల్లా కాంగ్రెస్ ఆర్డినేటర్ చోటు, మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ళ భరత్ గౌడ్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎగుర్ల ప్రశాంత్, అసెంబ్లీ సోషల్ మీడియా కాంగ్రెస్ ఆర్డినేటర్ అభినయ్ గౌడ్, ఫిషరీష్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, ఎడ్ల తిరుపతి, అంకారాపు మధు , వినోద్, నరేందర్, వినయ్, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు