రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో పాఠశాల పై కేసు నమోదు అయింది. మండల కేంద్రంలోని కోనేటి రమేష్ కుమారుడు కోనేటి అద్విత్ శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నాడు. జనవరి 9వ తేదీన ప్రతి రోజులాగే స్కూలుకు వెళ్లిన అద్విత్ మధ్యాహ్నం పాఠశాలలో టీచర్ కొట్టడంతో కన్నుకు తీవ్ర గాయం అయింది. సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల వరకు తల్లిదండ్రులకు తెలియజేయకపోగా ఎలాంటి ప్రథమ చికిత్స అందించలేదు. దీంతో ఆ విద్యార్థికి తీవ్ర గాయమైన పాఠశాల యజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి అడగడంతో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు, విద్యార్థి అద్విత్ కు కన్నుకు తీవ్ర గాయం కావడంతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడి నుండి సిద్దిపేట, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించారు. తమ కుమారుడి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి తల్లిదండ్రులకు సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు,