ముస్తాబాద్ మండలంలో టెంట్ హౌస్ మరియు డెకరేషన్ యూనియన్ 52 మంది సభ్యులు సమావేశమై యూనియన్ నూతన అధ్యక్షుడిగా బద్ద హరీష్, ఉపాధ్యక్షుడిగా బొమ్మను దేవేందర్, క్యాషియర్గా పార్వతి రాజు, సహాయ కార్యదర్శిగా బద్దిపడిగ సతీష్ ను ఎన్నుకున్నారు. వారికి యూనియన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బద్ద హరీష్ మాట్లాడుతూ అధ్యక్షునిగా బాధ్యతను అప్పగించినందుకు యూనియన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్ విషయంలో సభ్యుల అభిప్రాయాల మేరకు నడుచుకుంటానని యూనియన్ ముందుకు నడిపించడంలో తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.


