ఎల్లారెడ్డిపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న చికెన్ సెంటర్ ల నుంచి వ్యర్థాలను సిరిసిల్ల నుంచి ఒక వాహనం వచ్చి రోజు తీసుకెళుతుంది. గత నాలుగు ఐదు నెలల నుండి కోళ్ల వ్యర్థాలను తీసుకువెళ్లే క్రమంలో ఎట్లాంటి జాగ్రత్తలు పాటించకపోవడంతో వ్యర్థాల నుండి వచ్చే నీరు రోడ్ పైన పడుతు దానివల్ల ఒకరోజు వరకు సమీప గృహాలు షాపుల వద్ద ముక్కు ముసుకోవలసిన పరిస్థితి వస్తుంది. దీనివల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నరు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన వాహనం ఏ ప్రదేశం నుంచి వెళ్తుందో ఏ షాపు దగ్గర ఆగిన ఒక రోజు వరకు ఆ పరిసర ప్రాంతాలలో వాసన వస్తుందని నిలబడలేకుండా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాహనం ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది సమాచారం లేదు తీసుకెళ్లే వాహనానికి కనీసం నెంబర్ ప్లేట్ కూడా లేదు వీరిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు కోరుచున్నారు