ఎల్లారెడ్డి పేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్టంపల్లిలో గల హనుమాన్ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు జరపడం కోసం అక్కడి గ్రామస్థులు ఏర్పాట్లు చేస్తుండగా పనులను మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ మంగళవారం పరిశీలించారు. ఇప్పుడు ఉన్న ఆలయం పక్కన ఇంకా కొంత మేర ఆలయ స్థలం ఆనుకుని భక్తులు ఆలయం చుట్టూ తిరిగేలా ప్రదక్షిణ స్థలం పెంచడం కోసం నిర్మాణ పనులు ప్రారంభించారు. పనులకు అవసరమగు ఇసుక లేక పనులు నిలిచిపోగా ఆలయ పనుల కోసం ఇసుకను మంజూరు చేయాలని మండల తహశీల్దార్ రామచంద్రంను, డిప్యూటీ తహశీల్దార్ జయంత్ కుమార్ కు విన్నవించడంతో ఆలయ పనుల కోసం ఇసుకను మంజూరు చేస్తామని మండల తహశీల్దార్ కార్యాలయం అధికారులు పేర్కొన్నారు. దన రూపేణ , వస్తు రూపేణ సహాయం చేయదలచిన వారు కిష్టం పల్లి ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కొరారు.